సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 3వ తేదీన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ప్లేస్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంపీసీ, బీజెడ్సీ పూర్తి చేసిన వారు ఈ డ్రైవ్‌కు అర్హులని, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.