జిల్లాకు మంజూరైన కొత్త పాఠశాలలో పనిచేసేందుకు 14 మంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై నియమించినట్లు జిల్లా విద్యాధికారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యాయులు వెంటనే విధుల్లో చేరాలని చెప్పారు. ఉపాధ్యాయులను చేర్చుకోవాలని మండల విద్యాధికారులకు సూచించారు.