సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టిజిఐఐసి పర్సన్ నిర్మల రెడ్డి పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో వివాహాలు జరిగితే, ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,11,116 రూపాయలను అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.