సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5వ తేదీన జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలలో మహిళల కబడ్డీ, పురుషుల వాలీబాల్, మహిళలు మరియు పురుషుల రన్నింగ్ విభాగాలలో ఆటలు జరుగుతాయి. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారు పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు 9985351111 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.