సంగారెడ్డి: రేపు దివ్యంగ దినోత్సవ కార్యక్రమాలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ఈనెల మూడవ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మంగళవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేస్తారు. కలెక్టర్ ప్రావిణ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్