సంగారెడ్డి: 5 నుంచి దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం

సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో శ్రీ దుర్గాభవాని దేవాలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజూ సామూహిక కుంకుమార్చనలు, అమ్మవారి కల్యాణోత్సవం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్