సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్, ఎన్నికల ప్రచార ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచార సర్వేను పరిశీలకులు పూర్తిగా పరిశీలించాలని, పోటీ చేసే అభ్యర్థులు మూడుసార్లు ఎన్నికల పరిశీలకుల ముందు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన తెలిపారు.