విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ అన్ మాల్డ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం సమ్మెకు దిగారు. విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని నాయకులు తెలిపారు.