సంగారెడ్డి: శ్రీ వైకుంటపురంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చనలు చేశారు. భక్తులు 'జై శ్రీమన్నారాయణ' అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్