భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహ రెడ్డి సంగారెడ్డిలో మంగళవారం మాట్లాడుతూ, రైతతు భరోసా వెంటనే విడుదల చేసి వ్యవసాయ రైతులను ఆదుకోవాలని కోరారు. శనగలు కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.