గురువారం సదాశివపేట మండలం నంది కంది జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని ముగ్గురు వ్యక్తులు వెంటనే కారును ఆపి కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా కాలిపోయింది. సదాశివపేట నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది.