సంగారెడ్డి: గొర్రెలకు ఉచితంగా వ్యాధి నివారణ టీకాలు

సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పి. ప్రావిణ్య శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి వల్ల గొర్రెల కాపరులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వాటికి వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ప్రభుత్వం గొర్రెలకు ఉచితంగా టీకాలు వేస్తున్నదని గొర్రెల పెంపకందారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్