సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఉచిత నృత్య సంగీత కీబోర్డ్, తబలా శిక్షణ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ శిక్షణలో, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.