సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, విద్యాపీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో లక్ష్మి గో ఆరాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం, భక్తులు శివపంచాక్షరీ నామాన్ని జపించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.