సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్య విద్యాపీఠంలో సోమవారం రాత్రి దశకోటి పంచముఖ పార్దివ లింగార్చన మహోత్సవ కార్యక్రమం జరిగింది. పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే ఏడాది మహాశివరాత్రి నాటికి దశకోటి పార్థివ లింగాన్ని తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.