సంగారెడ్డి పట్టణం ప్రశాంత్ నగర్ లోని సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో సాయిబాబాకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు.