ఉద్యోగ, ఉపాధ్యాయులకు పంపిణీ చేయనున్న హెల్త్ కార్డుల విధివిధానాలను వెంటనే ప్రకటించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి విధివిధానాలు ప్రకటించకుండా హెల్త్ కార్డులు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని ఆయన కోరారు.