గురుపౌర్ణమి సందర్భంగా సంస్కార భారతి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంయుక్త ఆధ్వర్యంలో పలు కళా రంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సత్య సాయి మందిర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జానపద కళలో నర్సింలు, వాయిద్యంలో లక్ష్మారెడ్డి, యోగా శిక్షకురాలు సక్కుబాయి, వ్యాఖ్యాత, గాయని మహాలక్ష్మి, వేణువు దత్తును శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు.