సంగారెడ్డి: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

సంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో 6,800 మంది, ఒకేషనల్‌లో 16 కేంద్రాల్లో 690 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఈ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్