సంగారెడ్డిలోని ఎంఎస్ క్రికెట్ మైదానంలో ఈనెల 11వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్ 25 జట్టు ఎంపిక జరుగుతుందని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఎంపికకు హాజరయ్యేవారు ఒరిజినల్ ఆధార్ కార్డు, ధృవపత్రాలు, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలతో ఉదయం 10 గంటలకు క్రికెట్ దుస్తులతో రావాలని సూచించారు.