కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ మల్లన్నపై పై హత్యాయత్నం చేయడం సరికాదని చెప్పారు. హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.