2017లో ఎల్.ఎల్.బి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యురాలు దేవిని, కాకతీయ విశ్వవిద్యాలయ వీసీ సోమవారం స్వర్ణ పతకంతో సన్మానించారు. అనంతరం, సంఘ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో ప్రధాన కార్యదర్శి మహేష్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.