సంగారెడ్డి: ఎంఈఓలు పాఠశాలలను సందర్శించాలి

సంగారెడ్డిలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో మండల విద్యాధికారులతో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ఎంఈఓ లు ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించాలని, సందర్శన సమయంలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించాలని అన్నారు. ఆన్లైన్ పెండింగ్ పనులన్నీ ఎప్పటికప్పుడు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్