సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ బోనాల దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం నేతలు మంగళవారం కలసి శాలువాతో సన్మానించి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 20వ తేదీన ముదిరాజ్ బోనాల ఊరేగింపు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పవన్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.