సంగారెడ్డి పట్టణంలోని చర్చిలలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సి ఎస్ ఐ మెథడ్ చర్చిలకు ఉదయం నుంచే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాన్ని, వెలుగును నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది క్రైస్తవులు పాల్గొన్నారు.