సదాశివపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఓపెన్ స్కూల్ అభ్యాసకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఓపెన్ స్కూల్ ద్వారా పొందిన పది, ఇంటర్ సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యతో సమానమని తెలిపారు. అభ్యాసకులు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.