జిల్లా కోర్టు ఆవరణలో పారా లీగల్ వాలంటీర్లకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భవాని చంద్ర మాట్లాడుతూ, జువెనైల్ జస్టిస్, ఫోక్సో, గృహహింస, వరకట్న నిషేధ, బాల్య వివాహాల నిషేధ చట్టాలపై వాలంటీర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య కూడా పాల్గొన్నారు.