జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15వ తేదీన తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల హాజరు, పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి చర్చ చేయాలని చెప్పారు. సమావేశం నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.