సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా రోడ్డు రవాణా అధికారి అరుణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రాబోయే నెల రోజుల పాటు, ప్రజలకు రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.