సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో గల దత్తగిరి ఆశ్రమంలో రాజ్యశ్యామల నవరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా ముగిశాయి. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ వేడుకలలో దత్తగిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్, మహా మండలి మండలేశ్వర్ డాక్టర్ సిద్దగిరి మహారాజ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బుధవారం నాడు జరిగింది.