టీపీయూఎస్ రాష్ట్ర కోశాధికారి భాస్కర్, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా విద్యా కమిషన్ నివేదిక సమర్పించిందని విమర్శించారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలో పేర్కొనడం సరికాదని అన్నారు. కమిషన్ తన నివేదికను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.