జిల్లాలో నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేయించాలని కోరారు. ప్రమాదానికి కారణమైన సిగాచి యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.