సంగారెడ్డి జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా శనగలు, జొన్నలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ మంజీరా రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు పృధ్విరాజ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మధ్య దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం లభిస్తుంది.