సంగారెడ్డి: జీవో నెంబర్ 30 అమలు చేయాలని వినతి

హైదరాబాద్‌లో మంగళవారం, నిరుద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంకు జీవో నెంబర్ 30 ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జీవో నెంబర్ 30 ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ నాయక్, ప్రేమ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్