సంగారెడ్డి: పాఠశాలల్లోని సమస్యలు పరిష్కరించాలని వినతి

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో డిఈవో వెంకటేశ్వర్లకు శుక్రవారం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్