సంగారెడ్డిలో మంగళవారం, మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్విరాజ్ ఆధ్వర్యంలో మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు. మార్క్ ఫెడ్ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.