రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక సంస్థల దివ్యాంగుల రాష్ట్ర చైర్మన్ షఫీ అహ్మద్ డిమాండ్ చేశారు. తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ మాదిరిగా తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.