సంగారెడ్డి: ఉద్యోగి జీవితంలో పదవి విరమణ సహజమే

ఉద్యోగి జీవితంలో పదవి విరమణ సహజమేనని టీఎన్జీఎస్ జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ అన్నారు. గురువారం వెటర్నరి డిపార్ట్మెంట్ విఎల్వో విష్ణువర్ధన్ రెడ్డి పదవీ విరమణ సభలో సంగారెడ్డి జిల్లా టీజీఈజేఎఫ్సి, టీఎన్జీఎస్ నేతలు పాల్గొన్నారు. టీఎన్జీఎస్ జిల్లా అధ్యక్షులు ఎండీ. జావీద్ అలీ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఎస్ అసోసియేట్ అధ్యక్షులు, టీజీఈజేఎఫ్సి జిల్లా అధ్యక్షులు కసిని శ్రీకాంత్, టీఎన్జీవిఏ జిల్లా కార్యదర్శి వరకాల విజయకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్