సంగారెడ్డి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుర్తింపు సంఘాన్ని మాత్రమే విలీన ప్రక్రియలో ఉంచుతామని చెప్పడం సరికాదని, అన్ని సంఘాలను కమిటీలలో చేర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్