సంగారెడ్డి: జూలై 5వ తేదీన సమరభేరి సభ

భువనగిరిలో జూలై 5వ తేదీన జరిగే సమరభేరీ సభను జయప్రదం చేయాలని తెలంగాణ రాజ్యాధికార సంస్థ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్