సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 'స్పార్క్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను ప్రోత్సహించడం, వారి విద్యా ప్రగతికి తోడ్పడటం ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి కూడా పాల్గొన్నారు.