సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో శ్రీ పాదుకార్చన కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వరి సిద్ధాంతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. 3, 62, 124 శివ పంచాక్షరి నామాన్ని భక్తులు జపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.