గురు పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో శ్రీ సత్యసాయిబాబా వ్రతాలను గురువారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు వేద పండితుల సూచనల ప్రకారం శ్రీ సత్యసాయి వ్రతక్రతువులను జరిపి మొక్కలు చెల్లించుకున్నారు.