సంగారెడ్డి: మద్యం సేవించి వాహనం నడుపుతే కఠిన చర్యలు

సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి డ్రైవర్లను హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. గురువారం సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలను డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్