సంగారెడ్డి: శ్రీవైకుంఠాపురంలో సుదర్శన నరసింహ హోమం

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో శనివారం సుదర్శన నరసింహ హోమ కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు వరద చార్యులు ఈ హోమాన్ని నిర్వహించారు. హోమం అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు 'జై శ్రీమన్నారాయణ' అంటూ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది.

సంబంధిత పోస్ట్