జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తు కొరకు ఈనెల 17వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www. nationalteachers. education. gov. inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి డీఈవో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.