సంగారెడ్డి: ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డిలోని సంఘ భవనంలో శనివారం యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెరుగైన పిఆర్సి ప్రకటించాలని కోరుతూ, డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్