సంగారెడ్డి: రేపటి నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం నుంచి 17వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్ ను https: //bse. telangana. gov. in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కరుణ, సెయింట్ ఆంథోనీ శాంతి నగర్, సెయింట్ ఆంథోనీ విద్యానగర్ పాఠశాలలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్