సంగారెడ్డి పట్టణ శివారులోని స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బిజెపి మాజీ కౌన్సిలర్ నాయి కోటి రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, స్మశాన వాటిక అభివృద్ధికి గతంలో విడుదలైన నిధులు పనులు చేయకుండానే మళ్లించారని ఆరోపించారు. మరోసారి నిధులు కేటాయించినా పనులు ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు.