టి.ఎన్. జి. ఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేని (ముజీప్) జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో సంగారెడ్డి టి.ఎన్. జి. ఎస్ యూనియన్ జిల్లా నాయకులు పాల్గొని ముజీప్ను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టి.ఎన్. జి. ఎస్ జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ, టి.ఎన్. జి. ఎస్ జిల్లా కార్యదర్శి రవి, టి.ఎన్. జి. ఎస్ సభ్యులు ఉన్నారు.